నూతన ఏడాదిలో జీతాల చెల్లింపులకు బిట్‌కాయిన్‌

SMTV Desk 2017-12-15 12:35:56  Bitcoin, japan GMO Internet Company

టోక్యో, డిసెంబర్ 15 : నూతన ఏడాదిలో బిట్‌కాయిన్‌ మైనింగ్‌లో జీఎంవో ఇంటర్నెట్‌ సంస్థ భాగస్వామి కానుంది. జపాన్‌లోని జీఎంవో ఇంటర్నెట్‌ సంస్థ వెబ్‌ సంబంధిత ఫైనాన్స్‌, ఆన్‌లైన్‌ అడ్వర్టైజింగ్‌, ఇంటర్నెట్‌ ఇన్ఫ్రాస్టక్టర్‌ వ్యాపారాల్లో దాదాపు 4000 మంది పనిచేస్తున్నారు. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఉద్యోగులకు 100,000 యెన్‌ల (890 డాలర్లు) వరకు బిట్‌కాయిన్‌ రూపంలో చెల్లించనుంది. కోరుకున్న వారికే ఇలా చెల్లిస్తామని హరుమి పేర్కొన్నారు. బిట్‌కాయిన్లను ఉపయోగించడం ద్వారా అదృశ్య కరెన్సీ గురించి బాగా తెలుస్తుందని ఆమె వెల్లడించారు. ఈ సంస్థ మే నుంచి బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌, ఎక్స్ఛేంజీ వ్యాపారం నిర్వహిస్తోంది. ఈ ఏడాది జనవరిలో 1000 డాలర్లున్న బిట్‌కాయిన్‌ విలువ ఈ నెలలో ఏకంగా 17,000 డాలర్లకు చేరుకోవడం విశేషమే.