సత్యసాయిబాబా బాటలో నడవాలి: గంభీర్

SMTV Desk 2017-12-15 11:54:37  goutham gambhir, Saikildan, rbl bank, visakapatnam

విశాఖపట్టణం, డిసెంబర్ 15: నగరంలో నేడు (శుక్రవారం) ఆర్‌బీఎల్‌ బ్యాంకు ఉద్యోగులు నిర్వహించిన సైకిల్‌దాన్‌ ముగింపు కార్యక్రమంలో భారత క్రికెటర్ గంభీర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విద్యావిహార్ లో జరుగగా, అక్కడి పాఠశాల యాజమాన్యం గౌతమ్‌ గంభీర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గంభీర్‌ సైక్లిస్టులను అభినందించి వారితో పాటు కొద్దిసేపు సైక్లింగ్‌ చేసి, సత్యసాయి స్కూల్‌ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అంతేకాదు సత్యసాయిబాబా చూపిన బాటలో విద్యార్థులు నడవాలని హితవు బోధించారు.