ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు...

SMTV Desk 2017-12-15 11:38:21  parlament, start, winter session, sumitra mahajan, speaker, modi

న్యూ డిల్లీ, డిసెంబర్ 15: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేడు ఉదయం 11గంటలకు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ భవన్ లోని సమావేశ మందిరంలో పార్లమెంట్ పై ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించిన అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్ సభను ప్రారంభించారు. కాగా రాజ్యసభను చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రారంభించారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది. అంతకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని మోదీ సభలో అన్ని ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. సభలో గొడవ చేసి గందరగోళ పరిస్థితులు సృష్టించకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విపక్షాలకు ఆయన హితవు పలికారు.