మిస్టర్‌ ఇండియా వరల్డ్‌గా జితేశ్‌ సింగ్‌...

SMTV Desk 2017-12-15 11:33:43  Mr. India World Title, Jitheesh Singh Dio, Uttar Prades.

ముంబై, డిసెంబర్ 15 : మిస్టర్‌ ఇండియా వరల్డ్‌ టైటిల్‌ను జితేశ్‌ సింగ్‌ డియో(ఉత్తరప్రదేశ్‌) అందుకొన్నాడు. ఇతను ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ముంబైలోని బాంద్రా ఫోర్ట్‌లో నిర్వహి౦చిన ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా.. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా, టెన్నిస్‌ క్రీడాకారుడు మహేశ్‌ భూపతి వ్యవహరించారు. అనంతరం కంగన "మిస్టర్‌ ఇండియా వరల్డ్‌ గా జితేశ్‌ సింగ్" పేరును ప్రకటించారు. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా అభి ఖజూరియా(చండీగఢ్‌), రెండో రన్నరప్‌ గా పవన్‌ రావ్‌(ముంబై) లు నిలిచారు.