“శవాలలాంటి ఇళ్ళల్లో.. బతికుండే మనుషులు ఉండే వాళ్ళు”...: కడప వెబ్ సిరీస్ ట్రైలర్

SMTV Desk 2017-12-15 11:16:08  kadapa web series, kadapa trailer, ram gopal varma kadapa,

హైదరాబాద్, డిసెంబర్ 15: సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ రాయలసీమ రెడ్డ్ల జీవితాలపై ఓ వెబ్ సిరీస్ ను తీస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు యూట్యూబ్ వేదికగా “కడప” వెబ్ సిరీస్ ట్రైలర్ సిసన్-1 పేరుతో ఒక వీడియోను విడుదల చేశారు. “ రాయలసీమ మగోల్లు అమ్మ కడుపులోనుంచే కత్తి పట్టుకొని పుడతారు” – అక్కడి వాళ్ళ నమ్మకం అంటూ ప్రారంభమైన ట్రైలర్, గతంలో జరిగిన కొన్ని సంఘటనలను చూపిస్తూ సాగుతుంది. చివరిగా ఇది కడప రెడ్డ్ల చరిత్ర అంటూ ముగుస్తుంది. ఇందులో “కడప..కడప..కడప..” అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఈ ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. గతంలో కూడా వర్మ పలు వెబ్ సిరీస్ ను సైతం విడుదల చేశారు. కానీ ఇది మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్ కావడం విశేషం.