ఆహ్వానపత్రికలో అబ్బురపరిచే ఆలోచన...

SMTV Desk 2017-12-15 11:12:21  viratkohli -anushka wedding, mahesh bhat, mumbai,

ముంబాయి, డిసెంబర్ 15: మొన్నటిదాకా పెళ్లి గురించి మాట్లాడుకున్నవారు, ఇప్పుడు రిసెప్షన్ ఆహ్వానపత్రిక గురించి మాట్లాడుకుంటున్నారు. అదేనండి భారత క్రికెటర్ విరాట్-అనుష్క వివాహ విందు ఆహ్వానం. అసలు ఆ ఆహ్వానపత్రిక ప్రత్యేకత ఏంటి? అనుకుంటున్నారా.. విందుకు ఆహ్వానిస్తూ పంపే కార్డుతో పాటు ఓ మొక్కను కూడా జతచేశారు. అంతేకాదు పర్యావరణానికి ఎటువంటి హాని చేయని పేపర్‌బ్యాగులో ఆ మొక్కని పెట్టి కార్డుతో అందిస్తున్నారట. ఈ విషయాన్నీ డైరెక్టర్ మహేశ్‌ భట్‌ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ, నూతన వధు వరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ కండోమ్‌ ప్రకటనల కంపెనీ కూడా ఈ విరాట్-అనుష్కలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 21న ఢిల్లీలో తాజ్‌ డిప్లొమాటిక్‌ ఎంక్లేవ్‌లో బంధువులకు, 26న ముంబైలో క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీలకు గ్రాండ్‌ రిసెప్షన్‌ ప్లాన్‌ చేసింది ఈ జంట.