గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీదే హవా..!

SMTV Desk 2017-12-14 19:20:38  exit pols, gujarat, elections, bjp, win

గా౦ధీనగర్, డిసెంబర్ 14 : మొత్తం 182 స్థానాలున్న ప్రతిష్టాత్మక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో ప్రశాంతంగా ముగిశాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం అయినప్పటికీ కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, గుజరాత్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని మొదట్లో రాజకీయ విశ్లేషకులు భావించినా.. పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అందుకు భిన్నంగా ఏకపక్షంగా ఉన్నాయి. గుజరాత్ లో జరిగిన కుల ఉద్యమాలు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, దళిత మైనారిటీలపై దాడులు, కాంగ్రెస్ విమర్శలు తట్టుకొని మళ్ళీ బీజేపీ నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ వివరాలు.. *సీ-ఓటర్ : బీజేపీ-108; కాంగ్రెస్-73; ఇతరులు 01. *టైమ్స్ నౌ : బీజేపీ-109; కాంగ్రెస్-70; ఇతరులు 03. *సహారా : బీజేపీ-110 నుంచి 120: కాంగ్రెస్ 65 నుంచి 75. *ఎబిపి న్యూస్ : బీజేపీ- 91 నుంచి 96; కాంగ్రెస్ 78 నుంచి 86; ఇతరులు 03 నుంచి 07.