ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

SMTV Desk 2017-12-14 19:04:44  GUJARATH POLING, COMPLETED, POLING PERCENTAGE, 68.

అహ్మదాబాద్, డిసెంబర్ 14 : గుజరాత్‌ శాసనసభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ముగిసింది. మొత్తం 182 నియోజక వర్గాలకు ఈ ఎన్నికలు నిర్వహించగా.. తొలిదశలో 89 నియోజకవర్గాలకు ఇదివరకే పోలింగ్ జరగగా, మిగతా 93 స్థానాలకు నేడు పోలింగ్‌ పూర్తయింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 68 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ సాధారణ వ్యక్తిలా లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఈ ఎన్నికల్లో తుది ఫలితాలు డిసెంబర్‌ 18న వెలువడనున్నాయి.