పోలవరంను గడువులోగా పూర్తిచేసే బాధ్యత మాది: గడ్కరీ

SMTV Desk 2017-12-14 14:48:21  polavaram, nitin gadkari, complete, 2019, meeting, chandrababu

న్యూఢిల్లీ, డిసెంబర్ 14 : కేంద్ర జలవనరుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ బుధవారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోలవరం నిర్మాణంపై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణం విషయంలో ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు భారత ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకమైందని, 2019 కల్లా పూర్తిచేయడం మా శాఖ బాధ్యతగా గడువులోపు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సివిల్‌ ఇంజినీర్‌ పనులు పూర్తిచేయడానికి గడువు 2019 వరకు ఉన్నా 2018లో ఎలా పూర్తిచేయాలన్న దానిపై మార్గసూచి తయారుచేశామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పారు. ఆయన జలవనరుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పనుల వేగం పెరిగి౦దని, గడ్కరీతో ప్రాజెక్టు కాకపోతే ఇంకెవ్వరివల్లా కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.