ఫెడరల్ వడ్డీ రెట్లు పెంపు...

SMTV Desk 2017-12-14 12:40:06  fedaral bank, america central bank, americca

వాషింగ్టన్, డిసెంబర్ 14 : ఇటీవల త్రైమాసికాల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న సందర్బంగా ఫెడరల్‌ రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను పెంచింది. ఈ మేరకు 0.25 శాతం వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత బలమైన అభివృద్ధిని సాధిస్తుందని, స్థూల జాతీయోత్పత్తి 2.5శాతం పెరగవచ్చని అంచనా వేస్తూ అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ పేర్కొంది. 2017లోనే ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచడం ఇది మూడోసారి.