ఎమ్మెల్సీ భూపతి రెడ్డి సస్పెన్షన్..!

SMTV Desk 2017-12-14 11:56:23  Nizamabad District MLC, Bhupathi reddy, suspension, kcr,

హైదరాబాద్, డిసెంబర్ 14 : నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ భూపతి రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పండ్ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేసీఆర్.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ చర్య వల్ల గాడి తప్పుతున్న ప్రజాప్రతినిధులకు ఒక హెచ్చరిక అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించిన౦దుకు భూపతి రెడ్డి ని సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై ఈరోజు లేదా రేపు ఆదేశాలు వెలువడనున్నాయి.