మారుతీ సుజుకీ ధరలు పెంపు...

SMTV Desk 2017-12-14 11:00:00  maruthi suziki rates, maruthi, tata motors

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: నూతన సంవత్సరంలో కార్ల దిగ్గజ కంపెనీలైన టాటా మోటార్స్‌, ఫోర్డ్‌, టయోటా, హోండా, స్కోడా, లు విక్రయ ధరలు పెంచబోతున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో దిగ్గజ కార్ల తయారి సంస్థ మారుతీ సుజుకీ, వచ్చే ఏడాది జనవరి నుంచి 2 శాతం ధరలు పెరుగనున్నాయని తెలిపింది. ముడి సరుకుల ధర క్రమంగా పెరగడమే ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది.