అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ : జగన్

SMTV Desk 2017-12-13 17:22:42  jagan, padayatra, contract employs, regularise

అనంతపురం, డిసెంబర్ 13 : పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కుక్కాలపల్లి క్రాస్ వద్ద విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు వివరించారు. ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఏపీ సీఎం చంద్రబాబు విపరీతమైన స్కాంలు చేస్తున్నారని వైఎస్ జగన్‌ మండిపడ్డారు. కార్మికుల పొట్టకొడుతూ విచ్చలవిడిగా దోచుకు తింటున్నాడని విమర్శించారు. ఉద్యోగుల అనుభవాన్ని బట్టి దశల వారిగా రెగ్యులరైజ్‌ చేస్తానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పి దానికనుగుణంగా 2008లో 7114 మంది ఉద్యోగులను ఆయన రెగ్యులరైజ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్ న్యాయమైనదే అయినప్పటికీ వారి సమస్యలను చంద్రబాబు సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మనందరి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల అనుభవం, విద్యార్హతను బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.