ఖరారైన కర్నూలు ఎమ్మెల్సీ పోలింగ్‌ తేది

SMTV Desk 2017-12-13 17:22:33  karnul, mlc, election poling, mlc shila chakrapanireddy

అమరావతి, డిసెంబర్ 13 : వైకాపాలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన కర్నూలు జిల్లా స్థానిక సంస్థ కోటాలో శాసనమండలి స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 19వ తేదిన ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. అలాగే నామినేషన్లకు తుది గడువును డిసెంబర్ 26వ తేదీగా నిర్ధారించారు. జనవరి 12న స్థానిక సంస్థ కోట కింద ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. అదే నెల 16న లెక్కింపు జరగనుంది.