అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు...

SMTV Desk 2017-12-13 16:58:54  bus accident, aprtc, gunturu, achhampeta

గుంటూరు, డిసెంబర్ 13: జిల్లాలో రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు వద్ద బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి గల కారణమని పోలీసులు గుర్తించారు.