విద్యార్థులను హెచ్చరించిన ఉపాధ్యాయుడు

SMTV Desk 2017-12-13 16:03:54  Teacher, students Commerce city

వాషింగ్టన్, డిసెంబర్ 13 ‌: పాఠశాల విద్యార్ధులను ఓ ఉపాధ్యాయుడు చంపేస్తాను అంటూ బెదిరించటంతో, తరగతి గదిలోని విద్యార్థులు ఆందోళనతో వెంటనే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అసలేం జరిగిందంటే... కామర్స్‌ సిటీలోని స్థానిక ఓతోఇ స్టార్ట్‌ మిడిల్‌ స్కూల్‌లో క్రిస్‌ బర్గార్ట్‌ అనే ఉపాధ్యాయుడు ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తుంటారు. ఇటీవల క్రిస్‌ తన విద్యార్థులనుద్దేశించి తరగతి గదిలోని ప్రొజెక్టర్‌పై ఓ మెసేజ్‌ ప్రదర్శించాడు. ‘నిశ్శబ్దంగా చదవండి, నాకు విద్యార్థులను చంపాలని ఉంది. కానీ నేను ఎవరినీ గాయపరచని ఓ మంచి క్రిస్టియన్‌ వ్యక్తిని. అందుకే సరిగ్గా కూర్చుని చదువుకోండని దాని అర్ధం. అలా అనేసరికి విద్యార్థులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయి, యాజమాన్యం జరిగిన విషయాన్ని తెలియజేశారు. దీంతో ఘటనపై యాజమాన్యం చర్యలు చేపట్టింది. అయితే ఇటీవలే క్రిస్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారట. ఈ విషయాన్ని స్కూల్‌ ప్రిన్సిపల్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు మెయిల్‌ ద్వారా వెల్లడించారు. విద్యార్థుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని, ఆ టీచర్‌ రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. అయితే క్రిస్‌ అలా ఎందుకు చేశాడన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు క్రిస్‌ చాలా మంచి ఉపాధ్యాయుడని కొందరు విద్యార్ధులు తెలియజేశారు.