రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలి : అన్నా హజారే

SMTV Desk 2017-12-13 14:20:18  anna hajare, formers, govt, agriculture, comments, agra

ఆగ్రా, డిసెంబర్ 13: సామజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి సమకాలీన రాజకీయాలపై విరుచుకుపడ్డారు. ఆగ్రాలో జరిగిన ఓ సమావేశానికి హాజరైన హజారే.. అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌వి పెట్టుబడిదారుల ప్రభుత్వాలేనని విమర్శించారు. దేశంలో 60 నుంచి 70శాతం వరకు ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారని, వారి క్షేమం కోరే ప్రభుత్వాలు రావాలని ఆయన ఆకా౦క్షి౦చారు. 2011లో అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక ప్రాత పోషించి తర్వాతి కాలంలో ఉద్యమం నుంచి విడిపోయి రాజకీయాల్లోకి వచ్చారు. సామాన్యుల కోసమే అంటూ సొంతంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టిన ఆయన డిల్లీకి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేజ్రీవాల్‌ ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయని, ఇకపై తన ఉద్యమం నుండి మరో కేజ్రీవాల్‌ పుట్టడని హజారే వ్యాఖ్యానించారు.