కె.విశ్వనాథ్‌కు పురస్కారం

SMTV Desk 2017-12-13 13:27:01  k. vishvanath, Award, vijayawada,

విజయవాడ, డిసెంబర్ 13 : ఈ నెల 17న విజయవాడలో నిర్వహిస్తున్న రోటరీ క్లబ్‌ ప్లాటినమ్‌ జూబ్లీ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు రోటరీ క్లబ్‌ జీవిత సాఫల్య కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.సి.దాస్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా‌ రోటరీ పౌరసంబంధాల విభాగం చైర్మన్‌ పులిపాక కృష్ణాజీ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్‌ హాల్లో, ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.