బొగ్గుస్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రిని దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు...

SMTV Desk 2017-12-13 13:05:12  coal scam, madhu koda, ex cm, guilty, cbi special court

న్యూ డిల్లీ, డిసెంబర్ 13: యూపీఏ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపిన బొగ్గు స్కాం విచారణను సీబీఐ కోర్టు పూర్తి చేసి, దోషులను నిర్దారించింది. గత కొన్ని సంవత్సరాలుగా విచారణ సాగుతున్న బొగ్గు కుంభకోణం కేసులో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, గనుల శాఖ మంత్రిని పక్కదోవ పట్టిస్తూ కోల్‌కతాకు చెందిన విని ఐరన్, స్టీల్ వియోగ లిమిటెడ్ కు జార్ఖండ్ లోని రాజ్ హర ఉత్తర బొగ్గు బ్లాక్ ను కేటాయించిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను న్యూ డిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం దోషిగా ప్రకటించింది. ఆయనతో పాటు బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులతో పాటుగా మరొకరిని కోర్టు బుధవారం దోషులుగా తేల్చింది. కోర్టు వీరికి గురువారం శిక్షలు ఖరారు చేయనుంది. ఈ బొగ్గు బ్లాకుల కేటాయింపు కోసం ఆ కంపెనీ 2007 జనవరిలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.