వాటర్‌ బాటిళ్లను ఎమ్మార్పీకి మించి అమ్మితే జైలుకే..!

SMTV Desk 2017-12-13 12:03:44  water bottles, MRP Rates, suprim court, According to the Laws and Measures Act

న్యూఢిల్లీ, డిసెంబరు 12: దుకాణాలు, రెస్టారెంట్లు, హోటళ్లలో మినరల్‌ వాటర్‌ బాటిళ్లను ఉన్న ఎమ్మార్పీ ధర కంటే అధిక ధరకు విక్రయిస్తే జైలు శిక్ష తప్పదు. ఈ మేరకు విచారణ జరిపే అధికారం ప్రభుత్వ అధికారులకు ఉందంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. భారత హోటల్‌, రెస్టారెంట్‌ సంఘాల సమాఖ్య (ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సమర్పించిన అఫిడవిట్‌లో.. తూనికలు, కొలతల చట్టం ప్రకారం ప్యాకేజ్డ్‌ లేదా ప్రి ప్యాకేజ్డ్‌ ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయించడం నేరమ౦టూ ప్రకటించింది. ఒకవేళ ఎవరైనా అధిక ధరలకు అమ్ముతూ పట్టుబడితే మొదటిసారి రూ.25 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి రూ.50 వేలు, ఆ తర్వాత రూ.లక్షతో పాటు ఏడాది జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.