నేడు టెట్‌ షెడ్యూల్‌ విడుదల చేయనున్న మంత్రి గంటా...

SMTV Desk 2017-12-13 11:39:43  tet, schedule, andrapradesh, govt, gantaa

అమరావతి, డిసెంబర్ 13: రాష్ట్ర విభజన అనంతరం మొదటిసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విడుదల చేయనున్నారు. షెడ్యూల్‌ అనంతరం నోటిఫికేషన్‌, సిలబస్‌ను ప్రకటించనున్నారు. ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహించి, త్వరగా ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకానికి డీఎస్స్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. టెట్‌ అర్హత ఉంటేనే ఉపాధ్యాయ నియామక పరీక్షకు అర్హులు కావడంవల్ల అభ్యర్థులు దీనికి ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది.