‘ఎంసిఎ’ ట్రైలర్ విడుదల

SMTV Desk 2017-12-12 19:50:04  MCA, TRAILER, NATURAL STAR, NANI, DIL RAJU

హైదరాబాద్, డిసెంబర్ 12 : నేచురల్ స్టార్ నాని హీరోగా, ఫిదా ఫేం సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ‘ఎంసిఎ’ మిడిల్ క్లాస్ అబ్బాయ్ అనేది ఉప శీర్షిక. డిసెంబర్ 21 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ రోజు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అందులో నాని అన్నయ్య పాత్రలో రాజీవ్‌ కనకాల, వదినగా భూమిక కనిపించారు. భూమిక తన మరిది నానితో ఇంటి పని చేయిస్తున్న సీన్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.‘పిన్నీ.. గయ్యాళి అత్త చేతిలో పడ్డ కొత్త కోడలైంది నా పరిస్థితి’ అంటూ ఆమనికి నాని ఫోన్‌ చేసి చెప్పే డైలాగ్‌ సూపర్ గా ఉంది. మరోపక్క నాని ప్రియురాలి పాత్రలో సాయిపల్లవి ‘ఎప్పుడు పెళ్లి చేసుకుందాం’ అంటూ ఆయన వెంట పడుతూ కనిపించారు. ఫ్యామిలీ డ్రామాతో పాటు మాస్‌ ప్రేక్షకులు మెచ్చే యాక్షన్‌ సన్నివేశాలకూ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన రెండు పాటలుకు విశేష స్పందన లభిస్తుంది. మిగిలిన సాంగ్స్‌ను డిసెంబ‌ర్ 16న వ‌రంగ‌ల్‌లో ప్రీ రిలీజ్ వేడుకలో అభిమానుల స‌మ‌క్షంలో ఘనంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.