విద్యాశాఖాధికారిని కొట్టిన ఉపాధ్యాయురాలు

SMTV Desk 2017-12-12 16:23:27  teacher Sexual abuse, markapuram prakasham dist

ఒంగోలు, డిసెంబర్ 12 : మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు ఎన్ని అడ్డుకట్టలు వేసిన మళ్లీ అదే పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో విద్యాశాఖాధికారిగా పనిచేస్తున్న రామ్‌దాస్‌నాయక్ అనే వ్యక్తి, గత కొద్ది రోజులుగా ఓ ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్నాడు. అయితే... చాలా రోజులు ఒప్పిక పట్టిన ఆ ఉపాధ్యాయురాలు అతని వేధింపులు తాళలేక మంగళవారం సాయంత్రం చెప్పుతో కొట్టింది. ఈ విషయం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఎంఈవో చేష్టల వల్ల విద్యావ్యవస్థకే మచ్చ తెచ్చిన ఆయనపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.