20 నిమిషాల ప్రయాణం.. 9 లక్షల బిల్లు..

SMTV Desk 2017-12-12 12:40:10  uber, canada, toronto, social media,

కెనడా, డిసెంబర్ 12: ట్యాక్సీ సర్వీసు సంస్థలలో ఉబర్‌ ఒక ప్రముఖ సంస్థ. తాజాగా కెనడాకు చెందిన టొరొంటోలోని విడ్మేర్‌ స్ట్రీట్‌ నుంచి క్వీన్స్‌వేకు వెళ్లేందుకు ఓ వ్యక్తి ఉబర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. 7.7 కిలోమీటర్లు20 నిమిషాల పాటు క్యాబ్‌లో ప్రయాణించి ఆ వ్యక్తి క్వీన్స్‌వేకు వెళ్లాడు. క్యాబ్‌ డబ్బులు ఇచ్చేందుకు బిల్లు చూడగా, సదరు వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఎందుకంటే.. ఆ రైడ్‌కు ఉబర్‌ వేసిన బిల్లు ఏకంగా 18,518 కెనడియన్‌ డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 9లక్షల పైనే. సాధారణంగా ఆ రైడ్‌కు అయ్యే ఖర్చు కేవలం 12 నుంచి 16 కెనడియన్‌ డాలర్లేనట. అయినా చేసేదేం లేక ఆ మొత్తాన్ని చెల్లించాడు ఆ వ్యక్తి. ఆ తరువాత ఉబర్‌ బిల్లును స్క్రీన్‌షాట్‌ తీసి సదరు వ్యక్తి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడిది హాల్ చల్ చేస్తోంది. అయితే ఘటనపై వెంటనే ఉబర్‌ కూడా స్పందించి, సాంకేతిక కారణాల వల్ల బిల్లులో పొరబాటు జరిగిందని,ప్రయాణికుడు కట్టిన మొత్తాన్ని ఆయనకు రీఫండ్‌ చేసినట్లు తెలిపింది. మళ్లి ఇటువంటి పొరపాట్లు పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది.