న్యూఢిల్లీ, డిసెంబర్ 12 : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైన నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మోదీ తన ట్విట్టర్ లో "కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ కి నా అభినందనలు. పదవీకాలం ఫలప్రదం కావాలని కోరుకుంటున్నా" అంటూ వెల్లడించారు. అలాగే రాహుల్ కి పార్టీ నేతల నుండి, ఇతర ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రాహుల్ ఏఐసీసీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.