నిరుద్యోగులకు శుభవార్త.. 3,943 ఉద్యోగాల భర్తీ...

SMTV Desk 2017-12-11 17:10:14  Jobs notification, telangana government, health department.

హైదరాబాద్, డిసెంబర్ 11 : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలియజేసింది. వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 3,943 ఉద్యోగాలను మంజూరు చేయనున్నామని, ఇందులో 1191 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, 685 డిప్యూటీ సివిల్‌ సర్జన్లు, 453 ఆర్‌ఎంవో, 562 స్టాఫ్‌ నర్సులతో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతులను జారీచేసింది.