దృక్పథం మార్చుకుంటున్న సౌదీఅరేబియా...

SMTV Desk 2017-12-11 17:06:03  saudi arabia, reforms, movie theaters, women freedom

రియాద్, డిసెంబర్ 11: సవాలక్ష నిబంధనలు గల ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో మహిళలకు అనేక ఆంక్షలు, కట్టుబాట్లు ఉంటాయి. అక్కడి మహిళలు ఒంటరిగా బయటకు రాకూడదు, పైగా చదువుకోవాలంటే కుటుంబంలోని తండ్రి, భర్త, లేదా సోదరుడి అనుమతి తప్పనిసరి. 21వ శతాబ్దపు ఆలోచనలు, శాస్త్ర సాంకేతిక అభివృద్దికి తగ్గట్టుగా సౌదీ ప్రభుత్వం సంస్కరణల బాట పట్టింది. ఇప్పటికే యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నేతృత్వంలో మహిళలపై ఆంక్షలను సడలించిన సౌదీ రాజ్యం, వచ్చే ఏడాది నుంచి ఆ దేశంలో సినిమా థియేటర్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని సోమవారం ఆమోదించారు. దీంతో వచ్చే ఏడాది నుంచి అక్కడ సినిమా హాళ్లకు లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. సౌదీ మహిళలు డ్రైవింగ్‌ చేసేందుకు అనుమతులిచ్చారు. అంతేగాక.. క్రీడా మైదానాల్లోకి కుటుంబ సమేతంగా వచ్చేందుకు వీలు కల్పించారు.