వాహనాలపై రూ. 25వేల వరకు ధర పెంపు...

SMTV Desk 2017-12-11 15:38:17  vehicles rate, tata motars, mayank farekh, veh

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వరుసగా ఉత్పత్తుల సంస్థలు ధరలు పెంచుతున్న క్రమంలో టాటా మోటార్స్ సంస్థ ఇదే జాబితాలో చేరింది. తాజాగా టాటామోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ పరేఖ్‌ ఓ ప్రకటనలో... వచ్చే ఏడాది జనవరి నుంచి వివిధ ప్యాసింజర్‌ వాహనాలపై రూ. 25వేల వరకు ధర పెంచుతున్నట్లు, మారుతున్న మార్కెట్‌ పరిస్థితులు, పెరుగుతున్న తయారీ ఖర్చులకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.