నేను నటినవ్వడానికి అమ్మే కారణం: ఏంజెలీనా జోలి

SMTV Desk 2017-12-11 15:08:14  anjelina jolie, actress, hollywood, mother, hospital bill, pay

లాస్‌ఏంజెలిస్, డిసెంబర్ 11: నటిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ అందాల భామ ఏంజెలీనా జోలి తను సినీ రంగంలోకి రావడానికి గల కారణాలను వివరించింది. తన అమ్మ అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికే నటన వైపు అడుగులు వేశానని ఆమె తెలిపారు. అందుకే 17-18 ఏళ్ల లేత వయసులో తన స్వభావ విరుద్ధమైన నటనవైపు వచ్చి కెమెరా ముందు నటించానని ఆమె పేర్కొన్నారు. సినీ రంగంలో తాను గొప్ప విజయాలను నమోదు చేసినప్పటికీ కెమెరా ముందు తనకెందుకో అంత సౌకర్యంగా, సహజంగా అనిపించదని తనకు బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చినపుడు ఉత్పన్నమైన పరిణామాలను తట్టుకోవడానికి ఎంతో ఒత్తిడికి గురైనట్లు ఆమె చెప్పారు. అద్భుత సృజనాత్మక రంగంలో ఉన్నప్పటికీ తాను మరో కోవకు చెందిన వ్యక్తినంటూ ఆమె చెప్పుకొచ్చారు.