2018 నాటికే పోలవరం పూర్తి: గడ్కరీ

SMTV Desk 2017-12-11 14:33:35  polavaram, nitin gadkari, construction, 2018, deadline

న్యూ డిల్లీ, డిసెంబర్ 11: జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్ట్ ను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇటీవల ప్రతిపక్షాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై విమర్శలు చేయడం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్నాళ్లుగా వైరుధ్యాలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం సహకరించకుంటే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను వారికే వదిలేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వరం పెంచారు. ఈ దశలో కేంద్రం కల్పించుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసే యుద్ధప్రాతిపదికన 2018లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పోలవరం సందర్శించి ప్రాజెక్టు పనులు సమీక్షిస్తానని నితిన్‌ గడ్కరీ అన్నారు. ఈ నెల 22న పోలవరం సందర్శి౦చిన తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతానని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద బిల్లులు పెండింగ్‌ లో ఉండకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.