వావ్.. వాట్సాప్‌ న్యూ ఫీచర్స్ ఇవే...

SMTV Desk 2017-12-11 13:26:10  whatsapp new features, whatsapp, new delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మరిన్ని సరికొత్త ఫీచర్లతో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ముందుకు వస్తుంది. అవేంటంటే... ట్యాప్‌ టు అన్‌బ్లాక్‌, షేక్‌ టు రిపోర్ట్‌, ప్రైవేట్‌ రిప్లైస్‌ ఫీచర్లు. కానీ ఈ ఫీచర్లు ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే యూజర్లకు అందుబాటులో రానున్నాయి. వీటి ఉపయోగాలు ఇలా ఉన్నాయి... ట్యాప్‌ టు అన్‌బ్లాక్: ఈ ఆప్షన్‌తో కేవలం నెంబర్‌పై ట్యాప్‌ చేస్తే అన్‌బ్లాక్‌ అవుతుంది. షేక్‌ టు రిపోర్ట్‌: ఎప్పుడైనా సాంకేతిక సమస్యలతో మెసేజ్‌లు వెళ్ళనప్పుడు, వాటి గురించి మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి తెలియజేయాలంటే.. ఒక్కసారి మన ఫోన్‌ని షేక్‌ చేస్తే చాలు. కాంటాక్ట్‌ లిస్ట్‌ ఓపెన్‌ అయ్యి ఓ ఆప్షన్‌ వస్తుంది. అందులో సమస్యేంటో వివరించి అందరికీ ఒకేసారి పోస్ట్‌ చేస్తే చాలు. ప్రైవేట్‌ రిప్లైస్‌: వాట్సాప్‌లో మనం గ్రూప్‌ మెసేజ్‌లు చేస్తుంటాం. గ్రూప్‌లో ఉన్న వారు ఏ మెసేజ్‌ చేసినా అది అందరికీ వెళుతుంది. ప్రైవేట్‌గా మెసేజ్‌ పంపాలంటే వేరుగా కాంటాక్ట్‌ ఓపెన్‌ చేసిమెసేజ్‌ పంపాలి. అలా కాకుండా గ్రూప్‌లోనే ఉండి మనం మెసేజ్‌ పంపాలనుకునే వ్యక్తికి ప్రైవేట్‌గానే మెసేజ్‌ పంపొచ్చు. మెసేజ్‌ టైప్‌ చేసి సెట్టింగ్స్‌లో ఉండే ప్రైవేట్‌ రిప్లై ఆప్షన్‌ నొక్కితే చాలు.