కళ్ళు మూస్తే అదే ఘటన కనిపిస్తోంది...

SMTV Desk 2017-12-11 13:26:05  LOVE JIHAD, Aphrajul Murder, Rajasthan,

కోల్‌కతా, డిసెంబరు 11 : రాజస్థాన్‌లో నాలుగు రోజుల క్రితం "లవ్‌ జిహాద్‌ పేరు"తో అఫ్రజుల్‌ను అత్యంత క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన నాటి నుండి ఆయన కుటుంబం విషాదం నుండి తేరుకోలేకపోతుంది. ఈ హత్య ఉదంతాన్ని ఆయన కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. అఫ్రజుల్‌ భార్య గుల్బహర్‌ బీబీ మాట్లాడుతూ.. "ఆ రోజు హత్య జరిగిన ఘటనను మర్చిపోలేకుండా ఉన్నాం. నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తోంది. కళ్ళు మూసుకుందామంటే ఆ రోజు ఆయనను అతి కిరాతకంగా కొట్టిన ఘటన కళ్ళ ముందు కనిపిస్తోంది. అసలు ఒక జంతువును కూడా మరీ ఇంతలా హింసించరు" అంటూ బోరున విలపించింది.