రేణిగుంట ఈఎంసీని గుర్తించిన కేంద్రం...

SMTV Desk 2017-12-11 13:13:32  renigunta, emc, cluster, green field electonic, mobile manufacturing

అమరావతి, డిసెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కృషికి కేంద్ర గుర్తింపు దక్కింది. చిత్తూరు జిల్లా రేణిగుంట ఈఎంసీని గ్రీన్‌ ఫీల్డ్‌ ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్‌గా గుర్తిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్లస్టర్‌కు 2015లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, అదే ఏడాది ప్రధాని మోదీతో శంకుస్థాపన చేయించారు. 113.27ఎకరాల్లో అన్ని మౌలిక వసతులతో ఏర్పాటుచేసిన ఈఎంసీలో సెల్‌కాన్‌, కార్బన్‌, లావా మొబైల్‌ తయారీ సంస్థలు ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. సెల్‌కాన్‌, డిక్సన్‌ ఇప్పటికే ఇక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, త్వరలోనే కార్బన్‌ సంస్థ తయారీ ప్రారంభించనుంది. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ ఈఎంసీని గ్రీన్‌ ఫీల్డ్‌ ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్‌గా గుర్తి౦చడంపై ఆనందం వ్యక్తం చేశారు.