రాష్ట్రంలో చలి తీవ్రత..

SMTV Desk 2017-12-11 12:45:12  Telangana weather report, Weather Department.

హైదరాబాద్‌, డిసెంబరు 11 : రాష్ట్రంలో నిన్నటి వరకు చలి తీవ్రత అధికంగా ఉండేది. ప్రస్తుతం తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంది. రానున్న మరో మూడు రోజులు ఇదే వాతావరణం కొనసాగనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని వాతావరణ కేంద్రాల పరిధిలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. హైదరాబాద్‌, నిజామాబాద్ లలో కాస్తంత పొడి వాతావరణం కనిపించింది. ఇదిలా ఉండగా గురువారం రాష్ట్రంలో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.