గూగుల్‌ మ్యాప్స్‌ లో మరో కొత్త ఫీచర్..!

SMTV Desk 2017-12-10 19:05:19  Google maps, new up dation, guidance, Washington.

వాషింగ్టన్, డిసెంబర్ 10 : మన౦ చేసే ప్రయాణంలో గూగుల్‌ మ్యాప్స్‌ మంచి గైడ్‌గా పనిచేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఎలా వెళ్ళాలో మాత్రమే కాదు మనం వెళ్తున్న దారి తప్పు అనేది కూడా సూచిస్తుంటుంది. ఇక మీదట గూగుల్ మ్యాప్స్ మనల్ని నిద్ర లేపనున్నాయి. అదేంటి అని ఆలోచిస్తున్నారా? అవును దీనికి చేయవలసిందల్లా ఒక్కటే.. గూగుల్‌ మ్యాప్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి. ముందుగా మనం వెళ్లాల్సిన ప్రాంతాన్ని నమోదు చేసి అనంతరం కింద ఉన్న స్టార్ట్‌ బటన్‌ను నొక్కాలి అంతే. ఇక మనం రైలులో ఉన్నా, బస్సులో ఉన్నా మన ప్రయాణానికి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ వస్తుంటాయి. ఒకవేళ మనం నిద్రపోతే గమ్యస్థానానికి దగ్గర్లో ఉన్నామని మనల్ని అలర్ట్‌ చేస్తూ నిద్రలేపుతాయట. మరో విషయమేమిటంటే.. మొబైల్‌ స్క్రీన్‌ లాక్‌లో ఉన్నా ఇవి అలర్ట్‌ చేయడం విశేషం. త్వరలోనే ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది.