ట్రంప్‌ ఎన్ని గంటలు టీవీ చూస్తారో తెలుసా?

SMTV Desk 2017-12-10 18:21:13  American President Donald Trump, TV, CNN, NSN Channels

వాషింగ్టన్, డిసెంబర్ 10 ‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రోజుకు ఎన్ని గంటలు టీవీ చుస్తుంటడో మీకు తెలుసా? ట్రంప్‌ ఉదయం 5.30 గంటలకు నిద్రలేచిన వెంటనే టీవీ పెట్టుకుని సీఎన్‌ఎన్‌, ఫాక్స్‌, ఎంఎస్‌ఎన్‌ ఛానెళ్లు చూస్తుంటారని ఓ నివేదిక వెల్లడించింది. ఒకవేళ ఈ మూడు ఛానెళ్లలో తన గురించి తప్పుగా ఏ ఛానెలైన రాస్తే వెంటనే ట్విటర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారట. ముఖ్యమైన సందర్భాల్లో ఒక్కోసారి ఎనిమిది గంటల పాటు టీవీ చూసిన రోజులూ ఉన్నాయట. సమావేశాలు ఉన్న సమయంలోనూ ముఖ్యమైన వార్తలు వదులకుండా ట్రంప్‌ కోసం ఓ టీవీ కూడా ఏర్పాటు చేశారని నివేదిక ద్వారా తెలిసింది. ఈ మేరకు స్పందించిన ట్రంప్ ఇటీవల ఆసియా పర్యటనకు వెళ్లిన అనంతరం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అసలు తాను ఎక్కవగా టీవీ చూడనని చెప్పారు. తన గురించి సరిగ్గా తెలీని వారు ఇలాంటి ప్రచారం చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ అందులో వాస్తవం లేదని ట్రంప్ తెలిపారు.