నకిలీ తెరలో టీటీడీ దేవస్థానం

SMTV Desk 2017-12-10 16:29:45   Tirumala, fake darshan tickets, thirupathi

తిరుమల, డిసెంబర్ 10 : ప్రపంచంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించేందుకు రోజుకు వేల సంఖ్యల్లో భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో వివిధ పూజల్లో, శ్రీవారి సేవాల్లో పాల్గోనేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. మరి టీటీడీ వీటన్నింటికి ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్‌ చేసుకునే సులువైన వీలు కల్పించింది. ప్రపంచంలో ఎక్కడ నుంచైనా స్వామివారి దర్శనంతో పాటు వివిధ రకాల పూజలకు ఆన్‌లైన్‌లో ముందుగానే బుక్‌ చేసుకునే సదుపాయం ఉన్న విషయం తెలిసిందే. కానీ అవకాశంగా భావించిన కొందరు అక్రమార్కులు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించారు. శ్రీవెంకటేశ్వరుడిపై భక్తులకున్న భక్తిప్రవత్తులను టెక్నాలజీ సాయంతో సొమ్ముచేసుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్ల సాయంతో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. అధిక ధరలకు టిక్కెట్లను విక్రయించి భక్తులను మోసం చేస్తున్నారు. తాజాగా తిరుమల తిరుపతి బాలాజీ ట్రావెల్స్ పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ 300 రూపాయల టిక్కెట్లను.. 500 రూపాయలకు విక్రయిస్తోన్న ముఠాను విజిలెన్స్‌ అధికారులు గుర్తించి గుట్టు రట్టు చేశారు. అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లను కొందరు హ్యాక్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అక్కడి భక్తులు ఆందోళన చెందుతున్నారు.