సీ ప్లేన్‌ కు రెండో దశ ప్రయోగ పరీక్షలు

SMTV Desk 2017-12-10 14:46:35  Union Transport Minister Nitin Gadkari, aviation minister Ashok Gajapati Raju, see plan, delhi

న్యూఢిల్లీ, డిసెంబర్ 10 : మౌలిక సదుపాయాలు అంతగా అందుబాటులోలేని చిన్నచిన్న నగరాలు, పట్టణాలకు వైమానిక సేవలు చేరువచేయడమే లక్ష్యంగా సీ ప్లేన్‌ అనే వంద విమానాలను ప్రవేశపెట్టనున్నారు. నీటిపైనా దిగే, ఎగిరే సీ ప్లేన్‌ అనే వంద విమానాలను కొత్త ఏడాదిలో అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రణాళికలు చేస్తోంది. ముంబయిలోని గిర్‌గామ్‌ చౌపతి తీరంలో కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ, విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజుల సమక్షంలో దీన్ని ప్రయోగాత్మకంగా నడిపింది. జపాన్‌ సంస్థ సిటౌచీతో కలిసి ఈ విమానాలను సంస్థ అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రస్తుతం జరిపినవి రెండో దశ పరీక్షలని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. వీటిలో పది నుంచి 14 మంది వరకూ కూర్చొని ప్రయాణించే వీలుంది. కాగా, వీటి విలువ రూ.2,579 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.