త్వరలో దీప కర్మాకర్ ఎంట్రీ...

SMTV Desk 2017-12-10 11:06:52   Deepa Carmaker, Gymnastics, Koch Bisweshwar Nandi

కలకత్తా, డిసెంబర్ 10: ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత జిమ్నాస్టిక్స్‌ సంచలనం దీప కర్మాకర్‌, పోటిలకు సర్వసన్నద్ధమైనట్లు ఆమె కోచ్ తెలిపాడు. రియో ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకం కోల్పోయిన దీప కాలికి గాయమై ఏడాదిగా జిమ్నాస్టిక్స్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆమె కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది మాట్లాడుతూ... శిక్షణలో ఆమె పురోగతి పరిశీలించిన తర్వాత, పూర్తి విశ్వాసం ఉంటె ఏప్రిల్‌లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో ఆడుతుందని, లేదంటే ఆగస్టులో జరిగే ఆసియా క్రీడల్లో పునరాగమనం చేస్తుందని అన్నారు.