తగ్గనున్న పెట్రోల్ ధరలు..!

SMTV Desk 2017-12-10 10:56:15  petrol rate decrease, central government, mithanal mix in petrol.

ముంబై, డిసెంబర్ 10 : వాహనదారులకు శుభవార్త. పెట్రోల్‌ ధరలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ధరలతో పాటు కాలుష్యాన్ని అదుపులో ఉంచే ముఖ్య ఉద్దేశంతో పెట్రోల్ లో 15 శాతం మిథనాల్ కలుపనున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. ఈ విషయంపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రకటన చేస్తామన్నారు. ఈ మిథనాల్ ను బొగ్గుతో తయారు చేస్తారు. దీని తయారీకి లీటరుకు రూ. 22వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం రూ.80గా ఉన్న పెట్రోల్‌ ధరను తగ్గించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పుడిప్పుడే ఈ మిథనాల్ తో నడిచే వాహనాలను వోల్వో కంపెనీతో సహా ఇతర కంపెనీలు తయారుచేస్తున్నాయి. ఇదిలా ఉండగా దీనితో తయారు చేసే వాహనాలు అంత ఎక్కువ మైలేజ్ ఇవ్వవని పలువురు ఆరోపిస్తున్నారు.