సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో మనమే నె౦. 01 : కేసీఆర్

SMTV Desk 2017-12-09 16:32:20  CM Kcr, pragathi bhavan meeting, kaleshvaram project.

హైదరాబాద్, డిసెంబర్ 09 : కరీంనగర్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకొని ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల విషయంపై స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాల౦టూ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ విషయంలో నిధుల సమీకరణ అవాంతరాలు లేవన్నారు. న్యాయస్థానానికి అందించిన అఫడవిట్‌కు కట్టుబడి ఉన్నట్టు స్పష్టంచేశారు. తక్కువ వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులను సాధించిన వారిని కేసీఆర్ అభిన౦దించారు. ఇదిలా ఉండగా దేశంలోనే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో నం-1గా ఉన్నామన్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం నుండి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకానికి అవసరమైన కరెంట్‌ ను ఇవ్వడానికి విద్యుత్‌ శాఖ చేసిన ఏర్పాట్లు అన్ని బాగున్నాయని విద్యుత్‌ శాఖకు అభినందనలు తెలియజేశారు.