గుంటూరులో సినీ తారల సందడి

SMTV Desk 2017-12-09 16:19:08  Guntur, nagachaitanya, thamanna, Shopping mall opening

గుంటూరు, డిసెంబర్ 09: నేడు గుంటూరు నగరానికి ప్రముఖ సినీ తారలు నాగచైతన్య, తమన్నా విచ్చేశారు. నగరంలోని ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన వీరు అభిమానులతో కాసేపు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం దుకాణంలోని వస్త్రాలు, నగలను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగచైతన్య, తమన్నా మాట్లాడుతూ...గుంటూరు నగరానికి రావడం తమకెంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు కూడా హాజరయ్యారు. ఈ తారల రాకతో అభిమానులు భారీ ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. దీంతో ఆ ప్రాంత పరిసరాల్లో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది.