పేరుకే ధనిక దేశాలు ..ఆకలిలో మాత్రం బీద దేశాలు

SMTV Desk 2017-06-16 11:20:15  Britan,America,Newziland,Unicef,Hungry problem

పారిస్, జూన్ 16 : ప్రపంచంలో ధనిక దేశాలు అనగానే అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి వాటి పేర్లు గుర్తుకు రావడం సహజం. కానీ ఈ దేశాలలో దారిద్య్రం ఉప్పొంగుతుంది. 41 సంపన్న దేశాలలో ప్రతి ఐదుమంది పిల్లల్లో ఒక చిన్నారి జీవితం దారిద్ర్య రేఖకు దిగువనే కొనసాగుతుందని యూనిసెఫ్ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దీనిలో భాగంగా సుమారు 13 శాతం మంది బాలలకు కూడా సరిపడే విధంగా సురక్షిత పౌష్టికాహారం అందుబాటులో లేదని తెలిసింది. అమెరికా, న్యూజిలాండ్ దేశాల్లో బాలలు, యువత పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నట్లు తేలిందని యూనిసెఫ్ డైరెక్టర్ సారా కుక్ తెలిపారు. బ్రిటన్ లో పసికందులు ఆకలితో అలమటించడంతో పాటు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారనే వాదన ఎక్కువగా వినిపిస్తుంది. విద్య, పౌష్టికాహారం, ఆరోగ్యం వంటి అంశాల్లో జర్మనీ, నొర్డిక్ (ఉత్తర యూరప్, ఉత్తర అట్లాంటిక్) దేశాలు మొదటి స్థానంలో ఉండగా, రొమేనియా, బల్గేరియా, చిలీ ఆఖరి స్థానాలకు నిలిచాయి. ఇక న్యూజిలాండ్ 34 వ స్థానంలో, అమెరికా 37 వ స్థానం లో ఉన్నాయి. తాము సర్వే నిర్వహించిన అత్యధిక దేశాలలో చిన్నారుల మానసిక పరిస్థితి దెబ్బ తినడంతో పాటు స్థూలకాయులుగా మారుతున్న యువత సంఖ్య పెరుగుతుందని యూనిసెఫ్ ప్రకటించింది.