మరో 3 రోజుల్లో పోలవరం ప్రాజెక్టు నివేదిక

SMTV Desk 2017-12-09 13:27:19  polavaram project, after 3 days Report, amaravathi

అమరావతి, డిసెంబర్ 09 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యాం నిర్మాణంపై మరో మూడు రోజుల్లో నేషనల్ హైడ్రో పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ నివేదిక ఇవ్వనుంది. ఢిల్లీలోని ఎన్‌హెచ్‌పీసీ జీఎం చోబ్యే ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల సాంకేతిక కమిటి ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. దీనిపై తమ నివేదికను పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సమర్పించనుంది. 2018 డిసెంబర్ నాటికీ వాలు ద్వారా నీళ్ళు ఇవ్వాలన్న లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ఉంది.