లంక ప్రధాన కోచ్ హతుర...

SMTV Desk 2017-12-09 10:47:22  haturasingh, srilanka main coach, srilanka

కొల౦బొ, డిసెంబర్ 9: గత కొద్ది కాలంగా లంక, ప్రధాన కోచ్ కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఎట్టకేలకు తెర పడింది. శ్రీలంక ప్రధాన కోచ్‌గా చంద్రిక హతురసింఘ ఎంపికయ్యాడు. డిసెంబర్‌ 20 నుంచి అతని నియామకం అమల్లోకి రానుందని లంక క్రికెట్‌ బోర్డు తెలిపింది. ఆయన 2000-09 కాలానికి లంక-ఎ జట్టుకు ప్రధాన కోచ్ గా, 2009-10 కాలానికి జాతీయ జట్టుకు తెర వెనుక కోచ్ గా పని చేశాడు. అంతకుముందు లంకకు గ్రాహం ఫోర్డ్‌ ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.