తొందరపాటు నిర్ణయాలు వద్దు : చంద్రబాబు

SMTV Desk 2017-12-08 19:48:57  AP CM, CHANDRABABU NAIDU, Alliance with the party issue.

అమరావతి, డిసెంబర్ 08 : పార్టీల పొత్తు విషయంపై ఏపీ చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే విష‌యంపై ఇప్పుడే ఆలోచించ‌డం లేద‌ని, ఈ విషయంపై అప్పుడే తొందర వద్దని త‌మ పార్టీ నేత‌ల‌కు సూచించారు. ప్రస్తుతం ప్రజలకు చేరువయ్యేలా పనులు చేయాలు చేయండంటూ పార్టీ నేతలను ఆదేశించారు. వచ్చే ఎన్నికల నాటికి అప్పటి సమయాన్ని బట్టి ఒక నిర్ణయానికి వద్దాం అంటూ పేర్కొన్నారు. కాగా గతేడాది ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే.