తగ్గిన పసిడి, వెండి ధరలు...

SMTV Desk 2017-12-08 17:36:25  GOLD, SILVER RATES, MCX MARKET,

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: మార్కెట్లో పసిడి, వెండి ధరలు మరింతా తగ్గాయి. వారాంతంలో కొనుగోళ్ళు మందగించడం వల్ల ధర పడిపోయినట్లు మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. నాటి ట్రేడింగ్‌లో మరో రూ.200 తగ్గి, పది గ్రాముల బంగారం రూ.29,750కి చేరుకుంది. మరో వైపు వెండి ధర రూ.425 తగ్గడంతో కిలో వెండి రూ.37,700కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర 1.27శాతం తగ్గడంతో ఔన్సు 1,247.80 డాలర్లు, వెండి 1.41శాతం తగ్గడంతో ఔన్సు 15.70డాలర్లు పలికాయి. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసుకోవడం సముచితమని మగువలందరూ భావిస్తున్నారు.