నారా వారి ఇంట్లోని ఆభరణాల విలువ ఎంత మీకు తెలుసా?

SMTV Desk 2017-12-08 17:26:07  Naras jewelery value in their women, vijayawada

విజయవాడ, డిసెంబర్ 08 : నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ తన కుటుంబ ఆస్తులు ఎంత అన్నది ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం ఆస్తులు పక్కన పెడితే, కేవలం తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణికి ఉన్న బంగారు ఆభరణాల ఎంతో తెలుసా? నారా భువనేశ్వరి పేరిట, దాదాపు రూ. 60 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో బంగారు, వెండి ఆభరణాలు లెక్క ఎంతంటే... విలువైన రాళ్లు పొదిగిన 3.519 గ్రాముల బంగారం ఉంది. దీని విలువ కోటి 27 లక్షల 16వేలు. వెండి 32 కిలోల 7 గ్రాములు.. అంటే రూ. 4లక్షల 57వేలు. రూ. కోటి 27 లక్షల 16వేల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. నారా బ్రాహ్మణి పేరిట రూ. 2.325 గ్రామల బంగారం సహా వజ్రాలు ఉన్నట్లు ప్రకటించారు. వాటి విలువ రూ. 15 లక్షల 95వేలు. ఇంకా రూ. 12లక్షల 37వేల విలువైన 97 కిలోల వెండి ఆభరణాలు బ్రాహ్మణి పేరుమీద ఉన్నట్లు సమాచారం.