కార్మికుల సమస్యలను విన్నవించిన జనసేన నేత

SMTV Desk 2017-12-08 16:36:18  AP Vijayawada, janasena leader pavankalyan, Workers problems

విజయవాడ, డిసెంబర్ 08 : ప్రజలు సంతోషంగా లేనప్పుడు ఎంతపెద్ద రాజధాని కట్టినా ఫలితం శూన్యమేనని, జనాసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. నేడు విజయవాడలో ఫాతిమా కళాశాల విద్యార్ధుల సమస్యలు తెలుసుకున్న పవన్, అనంతరం విద్యుత్‌ ఒప్పంద కార్మికులు వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రెండేళ్లుగా రాష్ట్రాన్ని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ..ప్రజల సమస్యలు అర్ధం చేసుకుంటారనే కాంగ్రెస్ కు కాకుండా టీడీపీకి మద్దతు పలికానని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే, ఓట్లు వేయించుకుని మోసం చేయవద్దని మంత్రులు యనమల, గంటాకు సూచించారు. ‘రాష్ట్రంలో నిర్మాణాత్మకంగా రాజకీయాలు చేస్తున్నా.. అలర్లు చేస్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. రాష్ట్రంలో డబ్బులు లేనప్పుడు ఆడంబరాలకు పోకూడదంటూ, త్వరలో రాష్ట్రంలో పార్టీ కార్యాలయం పెడుతున్నానని దీంతో సమస్యలపై పరిష్కారం చేస్తానని పవన్‌కల్యాణ్‌ వెల్లడించారు.