నిశ్శబ్ద ఛేదకులకు టైమ్స్ ఇచ్చిన గౌరవం

SMTV Desk 2017-12-08 16:06:54  Times, Sexual harassment, Newyark

న్యూయార్క్, డిసెంబర్ 08 ‌: సాధారణ మహిళలే కాకుండా సెలబ్రిటీలకు కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులు, దాడులపై గళమెత్తి ప్రపంచానికి తెలియజేసిన ‘నిశ్శబ్ద ఛేదకులు’ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక టైమ్స్ ‘ఈ ఏటి మేటి వ్యక్తి’గా నిలిచింది. ఈ సందర్భంగా టైమ్‌ మ్యాగజిన్‌ ఈ నెల 6న కవర్‌పేజీని విడుదల చేసింది. అయితే, ఐదుగురు మహిళలు నల్లరంగు దుస్తులు ధరించి ఉన్న ఫొటో అది. ఈ ఐదుగురితో పాటు పేజీకి కుడివైపు కింది భాగంలో మరో మహిళ చేయి కూడా కనిపిస్తుంది. దీంతో ఆ కవర్‌పేజీని చూసిన వారందరికీ మొదటగా వచ్చే అనుమానం ఆ చేయి ఎవరిదై ఉంటుందని, అలా మిస్టరీగా మారిన ఆ చేయి గురించిన రహస్యాన్ని ‘టైమ్‌’ ఎట్టకేలకు వెల్లడించింది. అది టెక్సాస్‌కు చెందిన ఓ యువతి చేయి అని పేర్కొంది. ఆ యువతి కూడా లైంగిక వేధింపులకు గురైందని, తన వివరాలు బయటికొస్తే ఆమె కుటుంబంపై ప్రభావం చూపుతుందన్న భయంతో, ఆమె పేరుగానీ.. ముఖం గానీ తెలియనీయకుండా చేయిని మాత్రం కవర్‌ పేజీలో ముద్రించామని వెల్లడించింది. దీన్ని బట్టి లైంగిక దాడుల విషయం బయటకు తెలిస్తే, ఏమవుతుందోనన్న భయంతో మౌన వేదన అనుభవిస్తున్న ఎందరో బాధిత మహిళలు, పురుషులకు ఆ చేయి సజీవచిహ్నం అని ‘టైమ్‌’ ఈ సందర్భంగా పేర్కొంది. ఆ పేజ్ లోని మిగతా వారు హాలీవుడ్‌ మొఘల్‌గా పేరుగాంచిన హార్వే వీన్‌స్టీన్‌ ప్రముఖ నటీమణులతో సహా పలువురిపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇలా ఎందరో మహిళలు లోలోపాల ఆవేదన వెళ్లగక్కుతున్న వేళ టైమ్స్ ఈ ఏటి మేటి గౌరవం ఇచ్చింది.